ఇదీ మాస్ మహారాజా రవితేజ స్థాయి!
on Jan 1, 2024

కొన్ని సినిమాలు వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోతున్నా కూడా అవి ప్రేక్షకుల గుండెల్లో నుంచి ఏ మాత్రం వెళ్లిపోవు. అవి ఎప్పుడొచ్చినా కూడా ప్రేక్షకులు వాటికి బ్రహ్మ రధం పడతారనే సంఘటన చాలా సినిమాల విషయంలో రుజవయ్యింది. ఇప్పుడు అలాంటి మూవీనే ఒకటి వచ్చింది .మూవీ పేరు వెంకీ. 2004 వ సంవత్సరంలో రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీగా మారింది.
వెంకీ సినిమా నూతన సంవత్సర కానుకగా డిసెంబర్ 30 శనివారం రోజున విడుదల అయ్యింది. ఎవరు ఊహించని విధంగా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టింది. శనివారం ఒక్క రోజు కోటి ముప్పై లక్షల రూపాయలని వసూలు చేసిన ఆ మూవీ ఆదివారం ఇంకో 60 లక్షల రూపాయలని వసూలు చేసింది. ఇలా రెండు రోజుల్లో కోటి 90 లక్షల రూపాయలని వసూలు చేసింది. రీ రిలీజ్ లో రికార్డు కలెక్షన్స్ ని సృష్టించిన సినిమాల జాబితాల్లో ఇప్పుడు వెంకీ కూడా చేరింది.
యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన వెంకీ మూవీలో రవితేజ సరసన స్నేహ నటించగా అందాల నటి రాశి ఒక ప్రత్యేక గీతంలో నటించింది. బ్రహ్మానందం, ఏవీఎస్, వేణు మాధవ్, మల్లికార్జునరావు, తదితరులు ముఖ్యపాత్రల్లో నటించగా అశుతోష్ రానా విలన్ గా చేసాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



